ఎందుకు మౌనంగా భరించామంటే….

దేశహితం కోసమే కొంత మంది ఆకతాయిల ఆగడాలను మౌనంగా సహించానని సీఆర్పీఎఫ్ జవాను విశ్వకర్మ చెప్పారు. కాశ్మీర్ లో సీఅర్పీఎఫ్ పై కాశ్మీరీ యువకులు కొందరు దాడిచేస్తున్న వీడియోలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ విడియోలో ఉన్న విశ్వకర్మ అనే సీఆర్పీఎప్ జవాను సెలవు పై స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనను రకరకాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన తాను సంయవనంలో వ్యవహరించానని అన్నారు. తమని తాము రక్షించుకుంటూ నిగ్రహాన్ని కోల్పోకుండా ఎట్లా ఉండాలనేది తమకు శిక్షణ ఇచ్చారని విశ్వకర్మ  పేర్కొన్నారు. అత్యంత సున్నితమైన ఆ ప్రాంతంలో తాను విధులు నిర్వహించానని పాకిస్థాన్ జిందాబాద్, ఇండియా గోబ్యాక్ అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అయినా తాము సంయవనం కోల్పోకుండా నిధులు నిర్వహించినట్టు చెప్పారు. తమపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారని ఆ తరువాత దాడికి ప్రయత్నించారని వివరించారు. రాళ్ల దాడులకు తాము భయపడే ప్రశక్తి లేదని అన్నారు. తాము నియంత్రణ కోల్పోయి కాల్పులు జరిపితే పరిస్థితి మరింత విషమిస్తుందనే తాము మౌనంగా ఉండిపోయామన్నారు.

తాను భారతమాత సేవ కోసమే సీఅర్పీఎఫ్ లో చేరానని చెప్పుకొచ్చారు. తాను తిరిగి కాశ్మీర్ లో  విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన ఆఖరి ఊపిరి వరకు దేశ సేవచేస్తానన్నారు. తన కుమారుడి పనితీరు చూసి తాను గర్వపడుతున్నట్టు విశ్వకర్మ తల్లి చెప్పారు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో తాను కొంత కలవరపడ్డానని అయితే అతని పనితీరు చూసి దేశప్రజలతో పాటుగా తాను గర్వపడుతున్నానని అన్నారు.

Releated

శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్ ఆరోగ్యహారం – పేద ప్రజలకు గొప్ప వరం

చిత్తూరు జిల్లాలో “ఆరోగ్యహారం” పేరుతో శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్, శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సమాజసేవా ట్రస్ట్ లు సంయుక్తంగా సమగ్ర వైధ్య శిభిరాలను నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని మదనపల్లికి సమీపంలోని వి. కొత్తకోట కందుకూరు అగ్రహారం గ్రామంలో ప్రస్తుతం ఈ వైధ్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్టు ట్రస్టు ప్రతినిధిలు ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థల ఆధ్వర్యంలో పూర్తిగా సమగ్రంగా గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నామని శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సేవా ట్రస్ట్ బాధ్యాలు […]

5న పోలింగ్‌.. 9న ఫలితాలు

బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్‌ 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. అయితే అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడువు ముగిసే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 15 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు […]