బీజేపీ నేత కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్

తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత, అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఊర్థూలో మాట్లాడిన వ్యక్తులు ఫోన్ లో కిషన్ రెడ్డిని తీవ్రంగా బెదిరించారు. దీనిపై కిషన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్ లో ఒకటి ల్యాండ్ లైన్ నుండి రాగా మరొకటి సెల్ ఫోన్ నుండి వచ్చినట్టు గుర్తించిన పోలీసులు ఈ కాల్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరు చేశార అనేదానిపై  దర్యాప్తు చేస్తున్నారు. సెల్ ఫోన్ కాల్ ను ఇంటర్నెట్ కాల్ గా పోలీసులు గుర్తించారు. కిషన్ రెడ్డికి వచ్చిన బెదిరింపు కాల్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఈ కేసుపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.

కిషన్ రెడ్డికి వచ్చిన ఫోన్ కాల్స్ పై దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే దీనికి సంబందించిన వివరాలను వెళ్లడిస్తామని పోలీసు అధికారులు చెప్పారు.