వాటర్ ఫెస్టివల్ లో అపశుత్రి-285 మంది మృతి

మయన్మార్ లో జరిగే సంప్రదాయ  తింగ్యాన్‌ ఉత్సవాల్లో ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. మయన్మార్ లో నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కోల్పోవడం సహజంగా మారింది. ఈ సంవత్సరం 285 మంది చనిపోగా 1075 మందికి గాయాలయ్యాయి. మయన్మార్ లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నిర్వహించే  తింగ్యాన్‌ వేడుకల్లో ప్రజలు ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుంటారు. హోళీ తరహాలో ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ వేడుకను నిర్వహించుకోవడం ఆనవాయితీ. వాటర్ ఫెస్టివల్ గా పిల్చుకునే ఈ వేడుకల్లో ఇటీవల కాలంలో అపశ్రుతులు చోటు చేసుకోవడం ఎక్కువయ్యాయి. వాటర్ ఫెస్టివల్ పేరిట ఒకరని ఒకరు నీళ్లలోకి తోసుకోవడం, భారీ ఎత్తున నీళ్లు చిలకరించుకోవడం, నీళ్లలోకి తోసుకోవడం వంటి చేస్టలతో ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది.

దీనికి తోడు ఈ పండుగ సందర్భంగా విచ్చలవిడిగా మధ్య ప్రవాహం ఉంటుంది. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల వినియోగం కూడా ఎక్కువే. దీనితో మత్తులో జోగుతూ చాలా మంది నీళ్లలో పడి మరణిస్తున్నారు. ఈ పండుగ నాలుగు రోజుల్లో గ్యాంగ్ వార్లు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ పండుగ నాలుగు రోజుల్లో దోపిడీలు, హత్యలు వంటివి కూడా అక్కడ సాధారణమే. ఈ నాలుగు రోజుల్లోనే 1200 కు పైగా కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం కూడా ఈ పండుగ రోజుల్లో 270 మంది మృతి చెందారు.