పార్టీ నుండి శశికళకు ఉధ్వాసన…?

అన్నాడీఎంకే పార్టీ నుండి శశికళను సాగనంపేందుకు ప్రణాళికలు సిద్ధం అయినట్టు తెలుస్తోంది. తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి   వరకు కత్తలు నూరుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంల మధ్య సయోధ కుదిరినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా శశికళతో పాటుగా అమె కుటుంబ సభ్యులను పార్టీ నుండి పూర్తిగా బయటకు పంపెందుకు రంగం సిద్ధం అయినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో శశికళ వర్గీయుల ఆగడాలు రోజురోజుకీ శృతి మించుతుండడంతో అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లో శశికళ పూర్తిగా సానుభూతిని కోల్పోయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పుడు బెంగళూరు జైల్లో ఉన్న శశికళ జైలు నుండే తమిళరాజకీయాలను తన గుప్పిట్లో ఉంచుకుని చక్రం తిప్పే ప్రయత్నం చేసినతప్పటికీ అది ఆశించన ఫలితాలను ఇవ్వలేదు.
శశికళ సమీప బంధువు ప్రస్తుతం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న దినకరన్ ను రేపో మారో పోలుసులు అరెస్టు  చేసే అవకాశాలు ఉండడంతో పార్టీ పరువు మరింత బజారున పడకుండా ఉండేందుకు శశికళను, ఆమె బంధు వర్గాన్నిమొత్తాన్ని అన్నాడీఎంకే నుండి బయటకు పంపడం ద్వారా పార్టీకీ వచ్చిన చెడ్డపేరును కొంత మేరకకైన తొలగించుకునే అవకాశం ఉందని అన్నా డీఎంకేలోని కీలక నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఏకంగా ఎన్నికల సంఘానికే 50 కోట్ల రూపాయల లంచం ఇవ్వడం ద్వారా అన్నాడీఎంకే అధికార ఎన్నికల చిహ్నాన్నిదక్కించుకోవాలనే దినకరన్ ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణలతో శశికళ వర్గం పీకల్లోతు కూరుకొనిపోయి ఉంది. అటు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు ప్రజల్లోనూ అనుమానాలు బలంగా ఉండడం కూడా శశికళకు మైనస్ గా మారింది.
తమిళనాడులో శశికళ పై పెరుగుతున్న వ్యతిరేకత వల్ల అన్నా డీఎంకే పార్టీ పుట్టి పూర్తిగా మునిగిపోవడం ఖాయమని భావిస్తున్న  కొంత మంది కీలక నేతలు అసలు శశికళనే పార్టీ నుండి బయటకు పంపండం ద్వారా పార్టీని రక్షించుకోవడంతో పాటుగా జయలలితకు నిజమైన వారసులుగా గుర్తింపు తెచ్చుకుని లాభపడాలనే ఆలోచనలతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అన్నా డీఎంకే నుండి శశికళను పూర్తిగా బయటకు పంపడం అంత అషామాషీ వ్యవహారం కాదని ఆమె వ్యతిరేకులు సైతం అంగీకరిస్తున్నా.పార్టీలో అన్ని లోటుపాట్లు పూర్తిగా తెలిసిన శశికళకు పార్టీలో బలమైన మద్దతుదారులే ఉన్నారు. పెద్ద సంఖ్యలో తన విధేయులకి టికెట్లు ఇప్పించుకున్న శశికళ కు పార్టీలో ముఖ్యంగా ఎమ్మెల్యేల్లో గట్టి పట్టుంది. శశికళను పార్టీ నుండి బయటకు పంపే ప్రయత్నాలు ఏమాత్రం బెడిసికొట్టినా అసలు ప్రభుత్వ మనుగడకే ఎసరు వచ్చే అవకాశం  ఉంది.
తమిళనాడులో ఏ మాత్రం సందు దొరికినా తన ఉనికిని చాటుకునేందుకు అటు బీజేపీతో పాటుగా ఇటు విపక్ష డీఎంకేలు కాచుకుని కూర్చున్నాయి. ఎమ్మెల్యేలు చేజారి చివరికి రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
 
తమిళనాట రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. క్షణక్షణం మారుతున్న సమీకరణాలతో ఊహకందనంత వేగంగా మారుతున్నాయి. నిన్నటివరకు అన్నాడీఎంకేపై శశికళ వర్గానికి తిరుగులేని ఆధిపత్యం. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుపాలైనా.. కటకటాల నుంచి ఆమె మంత్రాంగం నడిపించిన పరిస్థితి. కానీ ఇప్పుడంతా తలకిందులైంది. శశికళ పేరు ఎత్తితేనే అధికార అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు. సీనియర్‌ మంత్రులు ఏకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారని సమాచారం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి చిన్నమ్మ శశికళకు ఉద్వాసన పలికేందుకు వేగంగా పావులు కదుతుపున్నట్టు తెలుస్తోంది.
తాజాగా తెరపైకి వచ్చిన అన్నాడీఎంకే, పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌) వర్గాల విలీనం వెనుక ఉన్న అసలు మంత్రాంగం ఇదేనని తాజాగా ప్రచారం జోరందుకుంది. ఒకప్పుడు శశికళకు వీరవిధేయుడిగా ఉన్న సీఎం ఎడపాటి పళనిస్వామి (ఈపీఎస్‌) తాజాగా ఓపీఎస్‌తో చేతులు కలిపేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం అర్ధరాత్రి వరకు సీనియర్‌ మంత్రులు, ఓపీఎస్‌ నేతలు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.  అయితే, ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు చేతులు కలిపి.. మన్నార్‌గుడి మాఫియాను పూర్తిగా అన్నాడీఎంకే నుంచి బయటకు తరిమేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *