కశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలు బంద్

కశ్మీర్ లోయలో  ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రాష్ట్ర పోలీసు ఆదేశాల మేరకు కాశ్మీర్ లోయలేని అన్ని 3జీ,4జీ సేవలను టెలికాం సంస్థలు నిలిపివేశాయి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవని టెలికాం సంస్థలు ప్రకటించాయి. కాశ్మీర్ లోయలో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాశ్మీర్ లోయలో కొంత మంది యువకులు సీఆర్పీఎఫ్ పోలీసుల పై దాడులు జరిపిన వీడియో తో పాటుగా కాశ్మీరీ యువకులతో సైనికులు బలవంతంగా పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేయిస్తున్నదృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రక్తమోడుతున్న యువకులపై సైనికులు దాడి చేసి కొడుతూ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయిస్తున్నట్టుగా వచ్చిన వీడియోలు కాశ్మీర్ లోయలో కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఉధ్రిక్తతలు మరింత పెరక్కుండా ఉండేందుకు పోలీసులు తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.