ఆ  భార్యాభర్తలు కవలలు- వాస్తవం కాదు…

ఓకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు అనుకోని పరిస్థితుల్లో భార్యాభర్తలు మారారంటూ వచ్చిన వార్తల్లో నిజంలేదని తేలింది. అది కేవలం కల్పిత వార్తేనంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మిస్సిస్సిప్పీ హేరాల్డ్  అనే వెబ్ సైట్ లో వచ్చిన వార్త ఆధారంగా పలు ప్రఖ్యాత మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ప్రచురించడంతో పాటుగా ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. దీనికి సంబంధించి మీడియా నెబ్ సైట్లలో కథనాలు రావడంతో ఈ వార్తకు అంతర్జాతీయ  ప్రాధాన్యం ఏర్పడింది.  ప్రపంచంలోని అన్ని ప్రముఖ సంస్థలు ఈ వార్తను ప్రసారం చేశాయి. రోడ్డు ప్రమాదంలో తల్లి దండ్రులు చనిపోవడంతో ఇద్దరు వేర్వేరు జంటలకు దత్తత వెళ్లారని అటు తర్వార కాలేజీలో కలుసుకుని ఒకరిని ఒకరు ఒకరు ఇష్టపడి పెళ్లిచేసుకున్నట్టు వార్త కథనాలు ప్రసారం అయ్యాయి.

ఈ వార్త సెను సంచలనం రేపడంతో సదరు జంట ఇంటర్వ్యూ కోసం మీడియా సంస్థలు ప్రయత్నించడంతో అసలు విషయం బయట పడింది. ఇది నిజమైన వార్త కాదని ఆ వెబ్ సైట్ ఇచ్చిన తప్పుడు కథనంగా తేలింది. దీనితో మీడియా సంస్థలన్నీ నాలుక కరుచుకున్నాయి.