టీడీపీకి దూరం కానున్న రేవంత్…?

తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి పార్టీ మారనున్నారా…? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ  అంశం హాట్ టాపిక్ గా మారింది. 2019 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి టీడీపీ ని వదిలిపెట్టడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ  కష్టంగా మారిన పరిస్థితుల్లో టీడీపీని నమ్ముకుని ఉంటే తన రాజకీయ భవితవ్యం కష్టమని భావిస్తున్న రేవంత్ పార్టీ మారతారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో పార్టీకి జవసత్వాలు నింపడం దాదాపు అసాధ్యమని భావిస్తున్న నేపధ్యంలో ఇక తప్పని పరిస్థితుల్లో రేవంత్ టీడీపీని వదిలిపి పెట్టక తప్పదని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలంతా అధికార పార్టీలోకి క్యూకట్టడంతో ఇప్పడు తెలంగాణ టీడీపీకి రేవంత్ మాత్రమే పెద్ద దిక్కుగా మిగిలారు. పార్టీ అధ్యక్షుడు గా ఎల్. రమణ ఉన్నప్పటికీ తెలంగాణ టీడీపీని బుజానికి ఎత్తుకుని నడుస్తున్న రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ రోజులు ఈ భారాన్ని మోయడం కష్టంసాధ్యంమని భావిస్తున్నట్టు సమాచారం.
రేవంత్ రెడ్డి పార్టీ మారితే ఏ పార్టీలోకి వెళ్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం అసాధ్యమని అంటున్న రేవంత్ కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆహ్వానం పలుకుతున్నట్టు సమాచారం. తెలంగాణలో బలమైన సామాజిక  వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి యువకుడిగా, సమస్యల పట్ల అవగాహన ఉన్న నేతగా పేరు ఉండడంతో పాటుగా మంచి వాగ్థాటి గల నేత కూడా కావడంతో కొంత మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ పార్టీలోకి రేవంత్ ను ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం పై రేవంత్ అంతగా ఆశక్తి చూపడం లేదని సమాచారం. కాంగ్రెస్ పరిస్థితి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఏ మాత్రం అశాజనకంగా లేదని ఈ పరిస్థితుల్లో  టీడీపీని వదిలి కాంగ్రెస్  లోకి వెళ్లాల్సిన అవసరం లేదని రేవంత్ భావిస్తున్నట్టు  తెలుస్తోంది. అటు బీజేపీ నేతలు కూడా రేవంత్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దాలని ఆపార్టీ జాతీయ  అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్న నేపధ్యంలో అధికార టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అనే రేవంత్ రెడ్డి లాంటి నేతలు తమ పార్టీలో ఉంటే బాగుంటుందని భావిస్తున్న బీజేపీ అందుకు  అనుగుణంగా రేవంత్ తో టచ్ లో ఉన్నట్టు సమాచారం.  అటు తెలుగుదేశం పార్టీ అధినేతకు కూడా బీజేపీతో  సత్సబంధాలు ఉండడంతో బీజేపీ లోకి వెళ్లడమే బెటర్ అని రేవంత్ అనుచరులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.  రానున్న ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు మరోసారి అధికారంలోకి రావడం  దాదాపుగా ఖాయమని మోడి ఛరిష్మా రాష్ట్రంలోనూ ప్రభావం చూపిస్తుందని ఈ  దశలో బీజేపీలో కి చేరడం వల్ల రేవంత్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో పాటుగా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు కూడా తమ పార్టీలోకి వస్తే  మీరే మా సీఎం అభ్యర్థి అంటూ అసెంబ్లీలో వ్యాఖ్యానించడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుతోంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి.
రేవంత్ మాత్రం ఇప్పుడు ఈ వార్తలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయంల ఉందని ఈ పరిస్థితుల్లో కొందర పడి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయంగా  ఇబ్బందులు తప్పవని భావిస్తున్న రేవంత్ సరైన సమయంలో నిర్ణయం  తీసుకుంటారని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *