ఆ వైరల్ మెసేజ్ అవాస్తవం…

ఆ నెంబర్ నుండి ఫోన్ వస్తే మరణమేనా…ఆ నంబర్ నుండి వచ్చే ఫోన్ ను లిఫ్ట్ చేస్తే వెంటనే ఫోన్ పేలిపోయి చనిపోవడం ఖాయమా… వాట్సప్ లలో ప్రచారం అవుతున్న ఈ మెసెజ్ ఇప్పుడు చాలా మందిని కలవర పెడుతోంది. రాత్రి 12.00 గంటల నుండి మూడు గంటల లోపే 777888999 నెంబర్ నుండి ఫోన్ వస్తోందని దాన్ని లిఫ్ట్ చేసిన వెంటనే ఫోన్ పేలిపోయి మరణిస్తున్నారంటూ వస్తున్న మెసేజ్ లు భయపెడుతున్నాయి. ఈ మెసేజ్ కు తోడుగా ఫలానా చోట ఫలానా వ్యక్తి మరణించాడంటూ రకరకాల పత్రికల క్లిపింగ్ లు గా చూపెడుతూ భయపెడుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 777888999 నంబర్ లో తొమ్మిది నంబర్లు మాత్రమే ఉన్నాయి. మన దేశంలో ఫోన్ ఫోన్ నెంబర్లకు పది అంకెలు ఉంటాయి. సరే ఇతర ఇతర దేశాల నుండి ఫోన్ వచ్చిందనుకున్నా ఇతర దేశాల నుండి వచ్చే ఫోన్ కాల్స్ కు ఆయా దేశాల కోడ్ ఖచ్చితంగా ఉంటుంది. అవేవీ లేకుండా వచ్చే వచ్చే ఈ ఫోన్ కాల్స్ ను ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ నెంబర్ల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ వల్ల ఫోన్ పేలిపోయి ఎవరైనా చనిపోయినట్టు ప్రభుత్వం నిర్ధారించిందా… పోలీసులు కేసును నమోదు చేశారా… అంటే అట్లాంటివి ఏవీ లేవు.
ఒకరి నుండి ఒకరికి ఇటుంటి మెసేజ్ లు వైరల్ అయి పోతున్నాయి. నిజానిజాలు తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేయడం ద్వారా విస్తృత ప్రచారం పొందుతున్నాయి. వాస్తవానికి తొమ్మిది అంకెల ఫోన్ నెంబర్ మన దేశంలో లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇతర దేశాల నుండి ఫోన్ వచ్చిందనుకున్నా అప్పుడు కూడా ఆయా దేశాల కోడ్ తో కలిసి అది కూడా తొమ్మిది అంకెలకు మించి ఉంటుందని చెప్తున్నారు. కేవలం ఫోన్ చేయడం దాన్ని లిఫ్ట్ చేయడంతో అవతలి వ్యక్తిని ఫోన్ పేలి చనిపోయేలా చేయడం అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు. ఇవన్ని కేవలం అభూత కల్పనలని కొంత మంది పనిలేని, మతి మాలిన వ్యక్తులు చేస్తున్న ప్రచారానికి చాలా మంది తమవంతుగా ఫార్వడ్ చేయడం ద్వారా సహకరిస్తున్నారని  వారు చెప్తున్నారు. వాట్సప్ లో చక్కర్లు కొడుతున్నట్టుగా ఆ నెంబర్ నుండి ఫోన్ వచ్చినట్టు ఇప్పటి వరకు ఎక్కడా నిర్థారణ జరగలేదని ఇటువంటి అవాస్తవాలు నమ్మవద్దని వారు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *