తుఫానీ డివిలియర్స్

‘ఏబీ డివిలియర్స్’ వీరబాదుడుకు పెట్టింది పేరైన ఈ ఆటగాడి ముద్దు పేర్లలో మరొకటి వచ్చి చేరింది. ప్రత్యర్థి బౌలర్ చీల్చి చెండాడే డివిలియర్స్ కు ‘తుఫానీ బ్యాట్స్ మన్’  అంటూ పుణె ఆటగాడు జయదేవ్‌ ఉనద్కత్‌  పేరు పెట్టాడు. డివిలియర్స్ బాదాలని నిర్ణయించుకున్నాక ఎంత బాగా బౌలింగ్ వేసినా ప్రయోజనం ఉండదంటూ చెప్పుకొచ్చాడు. ఆనారోగ్యం కారణంగా ఐపిఎల్ లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టిన డివిలియర్స్ వచ్చీ రావడంతోనే తన విధ్వంసకర బ్యాటింగ్  తో అదరగొట్టాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో ఆడిన మ్యాచ్ లో బ్యాటింగ్ ప్రతాతం చూపించిన డివిలియర్స్ 46బాల్స్ లో 89 రన్స్ చేశారు. 

              ఈ భూ ప్రపంచంలోనే డివిలయర్స్  అంతటి విధ్వంసకర, భయంకరమైన క్రికెటర్ ను మరొకరిని చూడలేదని సౌత్ ఆఫ్రికా మాజీ ఫెస్ బౌలర్ అలెన్ డోనాల్డ్ అంటున్నాడు. తాను ఎంతో మంది ఆటగాళ్లను చూశానని కానీ డివిలియర్స్ లాంటి భయంకరమైన ఆటగాడు మరొకడు లేడని డోనాల్డ్ అంటున్నాడు. మిస్టర్‌ 360, సూపర్‌ మ్యాన్‌ ఆఫ్‌ క్రికెట్‌, విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ అంటూ ముద్దుగా  పిల్చుకునే డివిలియర్స్  ఖతాలో మరికొన్ని ముద్దు పేర్లు వచ్చి చేరాయి.

Releated

టీ20 సిరీస్‌ రోహిత్‌ సేనదే..

నాగ్‌పూర్‌ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్‌ బంగ్లాపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సొంత గడ్డపై భారత్‌ సీరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. దీపక్‌ చాహర్‌ దాటికి 19.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. 7పరుగులు ఇచ్చి 6వికెట్లు తీసిన చాహర్‌ అజంతా మెండిస్‌ రికార్డు(6\8) […]

కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీలు

నాగ్‌పూర్‌: బంగ్లాతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో బంగ్లాకు టీమిండియా 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేఎల్‌ రాహుల్‌ (52; 35 బంతుల్లో 7ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడగా.. అయ్యర్‌ (62; 33 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్లు) బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో షఫీల్‌ ఇస్లామ్‌, […]