కులభూషణ్ విడుదలకు ముమ్మర యత్నాలు

పాకిస్తాన్ కోర్టు గూడచర్యం నేరంపై మరణశిక్షను విధించిన భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ ను విడిపించేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒక పక్క దౌత్యపరమైన ఒత్తిడి తీసుకుని వస్తూనే మరో వైపు పాకిస్తాన్ కోర్టుల ద్వారానే కులభూషణ్ ను బయటకు రప్పించే ప్రయత్నాలను చేస్తోంది. కులభూషణ్ జాదవ్ కేసుకు సంబందించిన ఛార్జీషీట్ పత్రాలను ఇవ్వాలని భారత్  పాకిస్తాన్ ను కోరింది. మరణశిక్షకు కు సంబంధించిన పత్రాలను కూడా ఇవ్వాలని భారత్  పాక్ ను కోరింది.
న్యాయపరంగా కులభూషణ్ ను విడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఇస్లామాబాద్ లో భారత హై కమిషనర్ గౌతమ్ చెప్పారు. జాదవ్ ను రక్షించేందుకు  తమ పరిధిలో ఉన్న అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు.
మరో వైపు కులభూషణ్ తరపును వాదించరాదని లాహోర్ హై కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు బార్ అసోసియేషన్ తరపున ఒక ప్రకటనను విడుదల చేశారు. కులభూషషణ్ తరపున ఎవరైనా వాదిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *