వికారాబాద్ కు ప్రధాని మోడీ భార్య

ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ వికారాబాద్ లో పర్యటించారు. ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా అమె పర్యటన సాగింది. గురువారం రాత్రి వికారాబాద్ కు వచ్చిన అమె శుక్రవారం ఉదయం  స్థానిక నాగదేవన ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జశోదా బెన్ భక్తులకు స్వయంగా వడ్డించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ప్రధాని నరేంద్ర మోడీ భార్య వికారాబాద్ కు వచ్చిన సంగతి తెలుసుకున్న తరువాత బీజేపీ కార్యకర్తలు, స్థానికులు ఆమెను చూడడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు.

ప్రధాని భార్యతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. తనను కలవడానికి వచ్చిన వారికి నమస్కరిస్తూ వెళ్లిపోయిన ఆమె పూర్తిగా సాదాసీదా గా వ్యవహరించారు. కొంతమంది హడావుడి చేసేందుకు చేసిన ప్రయత్నాలను ఆమె సున్నితంగా తిరస్కరించారు.