ఎక్స్ ప్రెస్ టీవీ కార్యాలయం ఎదుట వంటా వార్పు

29cae306-df73-49f4-8eee-e757758a2094 69229e8b-4938-4b8e-95f8-e5d5316238fc

జీతాల కోసం ఎక్స్ ప్రెస్ టీవీ ఉద్యోగులు కార్యాలయం ఎదుట వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. టీయూడబ్లుజే హైదరాబాద్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ  నిరసన కార్యక్రమంలో ఉద్యోగులతో పాటుగా  టీయూడబ్లుజే నేతలు పాల్గొన్నారు. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులనువేధిస్తున్న ఎక్స్ ప్రెస్ టీవీ యాజమాన్యం జీతాలు ఇవ్వాలంటూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో కార్యాలయానికి తాళాలు వేసి అప్రకటిత లాకౌట్ చేసింది. దీనితో ఉద్యోగులు, యూనియన్ నాయకులు తమ నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేశారు. టీయూడబ్లుజే నేతల సహాయంతో హోం మంత్రి నాయిని నర్శింహ్మారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించిన ఎక్స్ ప్రెస్ టీవీ ఉద్యోగులు కార్యాలయం ఎదుట వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు.

జీతాలు ఇవ్వకుండా వేధిస్తుండడంతో పాటుగా కార్యాలయానికి తాళాలు వేసి పారిపోయిన ఎక్స్ ప్రెస్ టీవీ యాజమాన్యాన్ని వదిలేది లేదని యూనియన్ నేతలు చెప్పారు. ఉద్యోగులు, సంఘాలు కలసికట్టుగా పోరాటం చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయన్నారు.