ఆర్థిక నేరాలపై జగన్ సమాధానం చెప్పాలి:బాబు

ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తి రాజ్యాంగం గురించి, చట్టాలను గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న చంద్రబాబు ఇక్కడ మీడియాతో మాట్లాడారు. జగన్ పార్టీ నుండి తమ పార్టీలోకి వచ్చిన వారికి మంత్రిపదవులు ఇవ్వడంపై జాతీయ స్థాయిలో జగన్ నానా యాగీ చేస్తున్నారని ఆయన ఇతర పార్టీ నేతలను తన పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. జగన్ వెంట ఇప్పుడు ఉన్న వాళ్లంతా గతంలో ఇతర పార్టీల్లో పనిచేయలేదా అన్నార. ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీతి నిజాయితీ అంటూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. డొల్ల కపెంనీలలో జగన్ పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ గుర్తించిందని దీనికి జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ను అన్నిరకాలుగా అభివృద్ది చేయడం కోసం తాను పనిచేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉందన్నారు. రానున్న పది సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.