సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. మంత్రి హరీశ్ రావుతో పాటుగా నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాళేశ్వరం వరద కాల్వ ద్వారా ఎస్సారెస్సీకి 0.75 టీఎంసీల నీటిని ప్రతీరోజు ఎత్తిపోసేలా మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను పరిశీంచిన కేసీఆర్ దాన్ని ఆమోదించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి వరకు ఎస్సారెస్సీ ద్వారా ఒక టీఎంసీ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం చెప్పారు. ప్రాజెక్టులతో పాటుగా పంటలకు నీరందరించే కాల్వలు కూడా బాగుండాలని సీఎం అన్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న భూసేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి వస్తుందని సీఎం తెలిపారు. దీని వల్ల భూసేకరణ సమస్యలు ఉండవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న భూసేకరణ చట్టం వల్ల రైతులకు మేలు కలుగుతుందన్నారు. భూసేకరణ సమస్యలు తీరిపోతే ప్రాజెక్టుల నిర్మాణం మరింత వేగవంతం అవుతాయన్నారు. కొత్త చట్టం వల్ల భూసేకరణ వేగవంతం అవుతుందన్నారు.