గౌతం గంభీర్ పై మండిపడ్డ సెహ్వాగ్

0
34

వీరేంద్ర సెహ్వాగ్- గౌతం గంభీర్ భారత క్రికెట్ జట్టు లోని విజయవంతమైన  ఓపెనింగ్ జంటల్లో ఒకటి. ప్రత్యర్థి బౌలర్లపై కలిసి విరుచుకుని పడిన ఈ భారత బ్యాట్స్ మెన్ సహచర ఆటగాళ్లు పై మాటల తూటాలను పేలుస్తున్నారు. గౌతం గంభీర్ ఇటీవల మరో ఆటగాడు ఇషాంత్ శర్మపై చేసిన కామెంట్ కు గట్టిగానే బదులిచ్చాడు వీరు. 60బంతులు కూడా ఆడని గంబీర్ కోసం 12కోట్లు ఎవరు ఖర్చు చేస్తున్నారంటూ సెటైర్ వేశారు.  తాజా ఐపీఎల్ లో ఇషాంత్ శర్మను ఈ ప్రాంచైసీ కొనుగోలు చేయకపోవడం పై స్పందించిన గౌతం గంభీర్ ఇషాంత్ నాలుగు ఓవర్లకు రెండు కోట్లు ఇవ్వడానికి ఎవరూ సిద్దంగా ఉండరంటూ వ్యాఖ్యానించారు. ఇషాంత్ శర్మ కనీస ధరను రెండు కోట్లుగా బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పంజాబ్ జట్టుకు కోచ్ గా ఉన్నవీరు సలహామేరకు పంజాబ్ అతన్ని రెండు కోట్లకు కొనుగోలు చేసింది.
పంజాబ్ ఆటగాళ్ల జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన మీడియా సమావేశానికి వీరేంద్ర సెహ్వాగ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు సమాధానంగా గంభీర్ పై సెటైర్ వేశాడు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here