అధ్వానీ కీలక ప్రకటన

రాష్ట్రపతి పదవి రేసులో తాను లేనని బీజేపీ అగ్రనేత ఎల్.కే.అధ్వానీ స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి ఎల్.కే.అధ్వానీ పోటీ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం దీనితో తెరపడినట్టయింది. తాను రాష్ట్రపతి పదవికోసం పోటీ పడడంలేదంటూ అధ్వానీ తేల్చిచెప్పేశారు. బాబ్రీమసీదు కుట్ర కేసులో అధ్వానీని విచారించాల్సిందేనంటూ సీబీఐ సుప్రీంకోర్టును అభ్యర్థించిన మరుసటి రోజే అధ్వానీ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన అధ్వానీ తాను రాష్ట్రపతి పదవికోసం రేస్  లో లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రపతి పదవికోసం తాను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదని తనకు ఆ ఉద్దేశం  కూడా లేదని చెప్పారు.

బీజేపీ సీనియర్ నేత అధ్వానీ ప్రభ పార్టీలో తగ్గిపోయింది. ఒకప్పుడు బీజేపీలో తిరుగులేని నేతగా ఉన్న అధ్వానీ ప్రస్తుతం మోడీ ప్రభంజనం లో మసకబారిపోయారనే చెప్పాలి. ఈ క్రమంలో బీజేపీలోని అత్యంత సీనియర్ నేత అయిన అధ్వానీని రాష్ట్రపతి పదవికి మోడీ సిఫార్సు చేసినట్టు వార్తలు వచ్చాయి. తాను తన గురువు అధ్వానీని మర్చిపోలేదని ఆయన్ను సముచితంగా గౌరవిస్తామని మోడీ పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. అధ్వానీతో పాటుగా ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ పేరు కూడా రాష్ట్రపతి పదవి రేసులో ఉన్నట్టు ప్రచారం సాగినా దాన్ని భగవత్ కొట్టిపడేశారు. తాను రాష్ట్రపతి పదవి కోసం పోటీ పడడంలేదని ఆయన ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగుస్తుండడంతో ఈ సంవత్సరం జులైలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.

Releated

శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్ ఆరోగ్యహారం – పేద ప్రజలకు గొప్ప వరం

చిత్తూరు జిల్లాలో “ఆరోగ్యహారం” పేరుతో శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్, శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సమాజసేవా ట్రస్ట్ లు సంయుక్తంగా సమగ్ర వైధ్య శిభిరాలను నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని మదనపల్లికి సమీపంలోని వి. కొత్తకోట కందుకూరు అగ్రహారం గ్రామంలో ప్రస్తుతం ఈ వైధ్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్టు ట్రస్టు ప్రతినిధిలు ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థల ఆధ్వర్యంలో పూర్తిగా సమగ్రంగా గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నామని శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సేవా ట్రస్ట్ బాధ్యాలు […]

5న పోలింగ్‌.. 9న ఫలితాలు

బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్‌ 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. అయితే అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడువు ముగిసే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 15 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు […]