ప్రత్యక్ష రాజకీయాల్లోకి గద్దర్

ప్రజా గాయకుడు గద్దర్ బుల్లెట్ బాటను వదిలి వ్యాలెట్ బాటను ఎంచుకున్నాడు. మావోయిస్టు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన గద్దర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు చెప్పారు. సంవత్సరాలుగా ఎర్రజెండాతో ఉన్న అనుబంధాన్ని గద్దర్ తెంచుకున్నారు.  తనకు తన మాతృసంస్థతో శత్రు వైరుధ్యం లేదని మిత్ర వైరుధ్యం మాత్రమే ఉందని చెప్పారు. తాను ఎర్ర జెండాను వదిలి బుద్ద జెండాను పట్టుకున్నానని చెప్పారు. అంబేద్కర్, పూలే ఆశయ సాధనాలే ధ్యేయంగా  రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు గద్దర్ స్పష్టం చేశారు. తాను కొత్తగా రాజకీయా పార్టీ పెట్టే యోచన లేదని గద్దర్ స్పష్టం చేశారు. అయితే రాజకీయాల్లో మాత్రం క్రియాశీలంగా వ్యవహరిస్తానని అన్నారు. బౌగోళిక తెలంగాణ ఏర్పడింది కానీ ప్రజల త్యాగాల తెలంగాణ ఇంకా ఏర్పాటు కావాల్సి ఉందన్నారు.
జనాభాలో మేజార్టీ వర్గీయులైన బడుగు, బలహీన వర్గాల వారికి అధికారం ఇంకా దక్కకుండానే పోతోందన్నారు. అట్టడుగు వర్గాలు అట్టడుగునే ఉండిపోతున్నాయని గద్దర్ పేర్కొన్నారు. తెలంగాణ లోని అందరు రాజకీయ నేతలను కలుస్తానని గద్దర్ తెలిపారు. పెద్ద నేతల నుండి కింది స్థాయి నేతల వరకు ప్రతీ ఒక్కరినీ కలుస్తానని ఆ తరువాత తన రాజకీయ ప్రవేశంపై స్పష్టస్త ఇస్తానని చెప్పారు. ఓటు వేయవద్దని పల్లె పల్లెలోనూ ప్రచారం చేసిన తాను ఇకపై ఓటు పై పల్లె పల్లెకు వెళ్తానని చెప్పారు. అంబేద్కర్, పూలే ఆశయ సాధన కోసం పనిచేసే సంస్థలను ఒక తాటిపైకి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తానని అటువంటి పూలను కలిపే దారంగా పనిచేస్తానని అన్నారు.
 
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *