సిరియా పై అమెరికా క్షిపణి దాడి

సిరియాపై అమెరికా ప్రత్యక్ష చర్యలకు దిగింది. సిరియా ప్రభుత్వ ఆధీనంలోని భూబాగంపై క్షిపణులను ప్రయోగించింది. మధ్యధారా సముద్రంలో ఉన్న తన నౌకల ద్వారా అమెరికా ‘తోమహౌక్’  క్షిపణులను ప్రయోగించింది. అమెరికా మొత్తం 59 క్షిపణులను ప్రయోగించింది. సిరియా పై అమెరికా క్షిపణుల దాడిని ఆదేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. సిరియా అధ్యక్షుడు బాషర్‌ అల్‌ అసాద్‌ తిరుగుబాటుదారుల ప్రబల్య ప్రాంతాల్లో రసాయన ఆయుధాల ప్రయోగానికి ప్రతీకారంగానే క్షిపణి దాడులను నిర్వహించినట్టు అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రసాయన దాడుల్లో 70 మంది మరణించగా అనేక వందల మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ రసాయన దాడులు ఎవరు చేసింది తెలియక పోయినా సిరియా అధినేత బాషర్‌ అల్‌ అసాద్‌ అదేశాల ప్రకారమే ఈ దాడులు జరిగినట్టు అమెరికా గట్టిగా నమ్ముతోంది. దీనితో సిరియా ప్రభుత్వ ప్రాబల్య ప్రాంతాలపై క్షిపణి దాడులు నిర్వహించింది.
సిరియా పై అమెరికా ప్రత్యక్షంగా దాడి చేయడం ఇదే ప్రధమం. సిరియా పై అమెరికా గతంలో ఎన్నడూ ప్రత్యక్ష దాడులకు దిగలేదు. అమెరికా దాడికి సిరియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అటు డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా ఒక దేశంలో మిలటరీ చర్యలకు అమెరికా దిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *