ఈ ఫోటో వినోద్ ఖన్నాదేనా…?

vinod khanna

బాలీవుడ్ నటుడు, గురుదాస్ పూర్ ఎంపీ వినోద్ ఖన్నాకు  చెందిన ఫొటోగా పేర్కొంటున్న ఒక ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. బక్కచిక్కి గుర్తుపట్టలేనట్టు ఉన్న ఆ ఫొటో వినోద్ ఖన్నాదేనని ఆయన క్యాన్సర్ తో బాధపుడూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనేది సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారం. అయితే దీనిపై వాస్తవాలు తెలియాల్సి ఉంది.డీహైడ్రేషన్ తో వినోద్ ఖన్నా ఆస్పత్రిలో చేరాడని ఆయన వేగంగా కోలుకుంటున్నారని వినోధ్ ఖన్నా కుమారుడు రాహుల్ ఖన్నా మీడియాకు చెప్పారు. అయితే క్యాన్సర్ తో బాధపడుతున్నారనే వార్తలపై వ్యాఖ్యానించేందకు రాహుల్ నిరాకరించారు.

ముంబాయిలోని ప్రఖ్యాత హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ లో వినోద్ ఖన్నాకు చికిత్స జరుగుతోంది. ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. డీహైడ్రేషన్ తో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు చెప్పిన ఆస్పత్రి వర్గాలు ఇతర వివరాలు చెప్పేందుకు నిరాకరించాయి.  ఆయన అభిమానుల దీవెనతో త్వరలోనే కోలుకుని ఇంటికి వస్తారని ఆస్పత్రి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.