యూపీలో వింత- మోగ్లీ,టార్జన్ తరహా బాలిక ప్రత్యక్షం

మనుషుల నుండి విడిపోయి జంతువులతో కలిసిపోయి వాటిలాగానే ప్రవర్తించే మానవులకు చెందిన కథలను మనం చదువుకున్నాం. పిల్లలు చాలా ఇష్టంగా చూపే మోగ్లీ, టార్జన్ లాంటి కథలు ఈ కోవకే చెందుతాయి. అయితే నిజంగా జంతువులతో కలిసిపోయి వాటితోనే కలిసిపోయిన ఒక బాలికను ఉత్తర్ ప్రదేశ్ లో గుర్తించారు. ఆ బాలిక పూర్తిగా ఎందుకు, ఎప్పుడు కలిసిందో తెలియదు కానీ ఒక కోతుల గుంపులో కలిసిపోయి జీవిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్రోయిచ్ అటవీ ప్రాంతంలో ఈ వింత చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు ఈ వింత బాలిక తారసపడింది.  మోతీపూర్ అటవీ ప్రాంతంలోని కటర్ణిఘాట్ అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న సురేశ్ యాదవ్ అనే పోలీసు అధికారికి ఈ బాలిక కనిపించింది. కోతుల గుంపుతో కలిసిపోయి ఉన్న ఈ బాలికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటితో హాయిగా జీవిస్తోంది.
కోతులతో పాటుగా అత్యంత వేగంగా చెట్టు ఎక్కుతూ కనిపించిన బాలికను అతికష్టం మీద పోలీసులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాలిక వింతగా ప్రవర్తిస్తోంది. మనుషులు కనిపిస్తే చాలు భయంతో పరుగులు తీస్తోంది. దీనితో ఆమెకు చికిత్స చేయడం ఇబ్బందిగా మారింది. అమె ఒంటిపై చాలా గాట్లు ఉన్నాయని , దీన్ని బట్టి ఆ బాలిక చాలా కాలం క్రితమే  కోతుల గుంపులో కలిసిపోయి ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. నాలుగు కాళ్ల మీద నడుస్తున్న బాలిక ఆహారాన్ని కూడా నేరుగా నోటితోనే తీసుకుంటోంది.
ప్రస్తుతం ఆ బాలిక మాట్లడలేకపోతోంది. ఆమెకు ఏ భాషా అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఆ బాలికను వైద్యులు, నిపుణుల పర్యవేక్షణలో ఉంచారు. ఆమె ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేవని ఆమె ఆరోగ్యగం బాగుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమెను ఎక్కువగా ఇబ్బందులు పెట్టకుండా చికిత్స అందచేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *