దేశానికే ఆదర్శం తెలంగాణ:కేటీఆర్

తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్రమంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగిన టీఆర్ఎస్ జనహిత ప్రగతి సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. రైతు రుణ మాఫీ, షీ టీంల ఏర్పాటు వంటి కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని యూపీ మన విధానాలను అమలు చేస్తోందని చెప్పారు. నిజామాబాద్ కార్పోరేషన్ అభివృద్దికి వేయి కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. వ్యాసాయం ఎట్లా చేయాలి అన్న విషయాన్ని నిజామాబాద్ రైతులు దేశానికే పాఠాలు నేర్పించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజామాబాద్ ముందడులో ఉందని అన్నారు. అందుకే ఈ జిల్లాపై కేసీఆర్ కు ప్రేమ ఎక్కువని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోందని కేటీఆర్ చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలోని పిల్లలకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్న ఘనత కేసీఆర్ దే అన్నారు. కేసీఆర్ మనసున్న మారాజని కేటీఆర్ అన్నారు. అందుకే పేదల సంక్షేమం కోసం ఆయన అహర్నిశలు కృషిచేస్తున్నారని చెప్పారు.