మరోసారి అధ్వానీ మెడకు బాబ్రీకేసు

వివాదాస్పద బాబ్రీసమసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత అధ్వానీ తో పాటుగా 14 మంది నేతలను మళ్లీ విచారించాల్సిందేనని సీబీఐ సుప్రీంకోర్టులో వాదించింది. అధ్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కతియార్ తో సహా పలువురు బీజేపీ అగ్రనేతలను ఈ కేసు నుండి తప్పిస్తూ లక్నో కోర్టు ఇచ్చిన తీర్పుపై సీపీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. లక్నో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును తిరిగి విచారించాలని సీబీఐ సుప్రీం కోర్టులో వాదించింది. లక్నో ట్రయర్ కోర్టు జరిపిన విచారణలో 195 మంది సాక్షులను విచారించగా మరో 300 మందిని విచారించాల్సి ఉంది. రాయ్ బరేలీ కోర్టు 57 మంది సాక్షులను విచారించగా మరో 100 మందిని విచారించాల్సి ఉంది.  బీజేపీ అగ్రనేత అధ్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్ తో పాటుగా 14 మందిపై ఉన్న కుట్రకేసును లక్నో కొర్టు కొట్టివేసింది. కింది కోర్టు తీర్పును అలహాబాద్ హై కోర్టు కూడా సమర్థించడంతో సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Releated

సుష్మస్వరాజ్ కన్నుమూత

సుష్మాస్వరాజ్ కన్నుమూత…

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశాలు. తీవ్ర గుండెపోటుతో ఆమె చనిపోయారు. 67 సంవత్సరాల సుష్మ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనివల్లే ఆమె పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. సుష్మాకు మంగళవారం రాత్రి గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు దిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సురి […]

సుదర్శన యాగం

యాదాద్రిలో భారీ ఎత్తున సుదర్శన యాగం

యాదగిరి గుట్ట దేవాలయ పుననిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చేదిద్దేపనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ యాగ నిర్వహణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామితో ముఖ్యమంత్రి చర్చించారు. యాదాద్రిలో వంద ఎకరాల యజ్ఞవాటికలో 1048 యజ్ఞ కుండాలతో యాగం నిర్వహించాలని నిర్ణయించారు. మూడు వేల మంది రుత్వికులు, మరో 3వేల […]