పాకిస్థానీ జెర్సీతో కాశ్మీర్ క్రికెట్ జట్టు

జమ్మూ కాశ్మీర్ లోని వర్గాలు పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. కాశ్మీర్ కు చెందిన చెందిన ఒక క్రికెట్ జట్టు పాకిస్థాన్ ఆటగాళ్లు ధరించే జెర్సీలు ధరించడంతో పాటుగా ఆటకు ముందు పాకిస్థాన్ జాతీయగీతాన్ని ఆలపించడం కలకలం రేపుతోంది. రెండు కాశ్మీరీ జట్ల మధ్య గండేర్ బాల్ జిల్లాలో జరిగిన ఈ మ్యాచ్ లో ఒక జట్టు పాకిస్థానీ జెర్సీ వేసుకుని రాగా మరో జట్టు సాధారణ తెల్ల దుస్తుల్లో వచ్చింది. మ్యాచ్ ముందు పాకిస్థానీ జాతీయ గీతాన్ని ఆలపించారు. మ్యాచ్ కు ముందు గౌరవ సూచకంగా మాత్రమే పాకిస్థానీ జాతీయ గీతాన్ని ఆలపించినట్టు నిర్వహాకులు చెప్తున్నారు. పాకీస్థానీ జెర్సీ ధరించినంది బాబా దర్యా ఉద్ -దిన్ జట్టుగా గుర్తించారు. తాము ఇతర జట్టకంటే భిన్నంగా కనిపించడం కోసం పాకిస్థానీ జెర్సీ ధరించామని జట్టు సభ్యులు చెప్తున్నారు. పైగా తాము చేసింది తప్పేమీ కాదని సమర్థించుంటున్నారు. తమ చర్య సరైందేనని ఇందులో తప్పు పట్టాల్సిందీ ఏమీ లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆటగాడు ఒకరు అంటున్నారు.

 

Releated

శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్ ఆరోగ్యహారం – పేద ప్రజలకు గొప్ప వరం

చిత్తూరు జిల్లాలో “ఆరోగ్యహారం” పేరుతో శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్, శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సమాజసేవా ట్రస్ట్ లు సంయుక్తంగా సమగ్ర వైధ్య శిభిరాలను నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని మదనపల్లికి సమీపంలోని వి. కొత్తకోట కందుకూరు అగ్రహారం గ్రామంలో ప్రస్తుతం ఈ వైధ్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్టు ట్రస్టు ప్రతినిధిలు ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థల ఆధ్వర్యంలో పూర్తిగా సమగ్రంగా గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నామని శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సేవా ట్రస్ట్ బాధ్యాలు […]

5న పోలింగ్‌.. 9న ఫలితాలు

బెంగళూరు: కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్‌ 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. అయితే అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడువు ముగిసే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 15 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు […]