అవి విద్వేష దాడులు కావు:సుష్మ

ఇద్దరు ఆఫ్రికన్ జాతీయులపై గ్రేటర్ నోయిడా పరిధిలో జరిగిన దాడి విద్వేష పూరిత దాడి కాదని అది నేరసంబంధమైందని కేంద్రం స్పష్టం చేసింది. ఆఫ్రికాకు చెందిన ఇద్దరు విద్యార్థులపై నోయిడా లో జరిగిన దాడి సంచలనం రేపింది. దీనిపై వెంటనే జరపాలంటూ భారత్ లో ఉన్న ఆఫ్రీకా దేశస్తులు డిమాండ్ చేశారు. తమకు రక్షణ కల్పించాలని, ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో విచారణ జరగాలంటూ ఆఫ్రికన్ విద్యార్థులు ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. ఈ అంశంపై లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ భారత్ విదేశీ విద్యార్థుల భద్రతకు వచ్చిన ముప్పు ఏమీ లేదని చెప్పారు. విదేశాల నుండి వచ్చి భారత్ లో చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న వారు భద్రతపై ఎటువంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గ్రేటర్ నోయిడా లో జరిగిన ఘటనను విద్వేష పూరిత నేరంగా చూడలేమని అది నేర పూరిత చర్య అని చెప్పారు.
ఒక చిన్న ఘటనను సాకుగా చూపి అనవసరం రాద్దాంత చేయవద్దని ఆమె సూచించారు. భారత్ ఉంటున్న ఆఫ్రికన్ దేశస్తులు ఎలాంటి భయాలు, ఆపోహలు పెట్టుకోవద్దని ఆమె సూచించారు. ఈ విషయమై వారితో సంప్రదింపులు జరుపుతున్నామని వాస్తవాలను వారికి వివరించినట్టు సుష్మ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *