శ్రీరాముడు-హనుమ చిన్ననాటి మిత్రులా…?

శ్రీరాముడు-హనుమంతులతీ మాటలకు అందని బంధం. నమ్మిన బంటుగా శ్రీరాముని సేవించిన వానరాగ్రేసరుడు సీతకోసం రాముడు వెతుకున్న సమయంలో కనిపించాడనేదే మనకు తెలిసింది. సీతను రావణాసురుడు అపరించిన తరువాత ఆమెను వెతుకుతున్న శ్రీరామ-లక్ష్మణులకు తారసపడిన హనుమంతుడి అప్పటి నుండి శ్రీరాముని సేవలోనే గడిపాడు. ఇదే విషయం మనం తరతరాలుగా చదువుకున్నాం. అయితే రాముడు-హనుమంతుడు చిన్నతనంలోనే కలిసి ఆడుకున్నారా? వారిద్దరికీ చిన్ననాటి నుండే పరిచయం ఉందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు చాలా మంది మెదళ్లను తొలుస్తున్నాయి.
ఒక టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న సీరియల్ లో శ్రీరాముడు-హనుమంతుడు చిన్న తనంలో కలిసి ఆడుకుంటున్నట్టు చూపించారు. దీనిపై వచ్చిన సందేహాలకు కూడా సదరు సీరియల్ నిర్మాతలు సమాధానం ఇచ్చారు. తాము చూపించిన దానికి తమ వద్ద పురాణ ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. హిందీలో ప్రఖ్యాత సంస్థ నిర్మించిన ఈ సీరియల్ ఇతర భాషల్లోకి కూడా అనువదించారు. తెలుగుతో పాటుగా చాలా భాషల్లో ఈ సీరియల్ ఇప్పుడు ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ ను చూస్తున్న వారికి శ్రీరామ- హనుమలకు చిన్ననాటి నుండే సాన్నిహిత్యం, స్నేహం ఉన్నాయని చూపించడం వింతంగా కనిపిస్తోంది. అయితే ఈ సీరియల్ నిర్మాతలు మాత్రం తాము చూపించింది అక్షరాల సత్యమనే వాదిస్తున్నారు.
వాలికి భయపడి చిత్రకూట పర్వతంలో దాక్కున్న సుగ్రీవుడికి మంత్రిగా ఉన్న హనుమంతుడు మొదటిసారిగా తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన రాముడు తారసపడతాడు. రామ-లక్ష్మణులను చూసిన హనుమంతుడు వారు వాలి పంపిన వారేననే భ్రమతో మారువేషంలో యోగి వేషంలో వెళ్లి మీరు ఎవరంటూ శ్రీరాముని ప్రశ్నించారని మనం వాల్మీకి రామాయణంలో చదువుకున్నాం. కానీ శ్రీరామ-హనుమలు అంతకు ముందే కలిశారని వారు కలిసి ఆడుకున్నాట్టుగా వస్తున్న ఈ కొత్త రామాయణంపై సందేహాలు పండితులే తీర్చాలి.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *