హెచ్ -1 బి నిబంధనలు మరింత కఠినం

అమెరికాలో హెచ్-1 బి వీసాలను మరింత కఠినం చేసింది. ఈ విసాలకు కేవలం కంప్యూటర్ ప్రోగ్రాం వచ్చి వుంటే చాలదని అమెరికా సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టం చేసింది. అక్టోబర్ 1వ తేదీ 2017 నుండి మంజూరు అయ్యే హెచ్-1 బీ వీసాలు కొత్త నిబంధనల ప్రకారం ఇస్తుండడంతో వేలాది మంది భారతీయ ఆశావాహులపై ఈ నిబంధనల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. డిసెంబరు22, 2000 నుంచి అమలవుతున్న విధానాల్లో అమెరికా మార్పులు తెచ్చింది.

  • వీసాలకు సంబంధించి గతంలో ఉన్న నిబంధనలకు కాలం చెల్లిందని నివేదికలో పేర్కొన్నారు
  • కేవలం రెండు సంవత్సరాల డిగ్రీలతో కంప్యూటర్‌ శిక్షణ పూర్తి చేసుకున్న వారి పై ప్రభావం పడే అవకాశం.
  •  కేవలం కంప్యూటర్‌ ప్రోగ్రాం వచ్చివుంటే చాలదని  స్పష్టీకరణ
  • హెచ్‌ 1బి వీసాలతో అమెరికాకు చెందిన పలు కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పలువురు కంప్యూటర్‌ నిపుణులకు నియమించుకుంటున్నాయి.
  • ఈ వీసా కింద అమెరికా వెళ్తున్న వారిలో భారతీయులే ఎక్కువ.
  • కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ అంటే కేవలం కంప్యూటర్‌ సంబంధిత అంశాల్లో ప్రవేశ ఉద్యోగాలు మాత్రమే. అయితే వీరికి మరిన్ని అదనపు అర్హతలు ఉండాలి.
  • కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి అదనపు పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలి.
  • ప్రత్యేక నైపుణ్యాలపై యాజమాన్యం ఆధారాలు చూపించాలి.
  • ప్రతి ఏడాది హెచ్‌-1 బి వీసాల కోసం వేలాది దరఖాస్తులు .
  •  లాటరీ విధానం ద్వారా 65 వేలమందిని ఎంపిక చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *