నటి రాఖీసావంత్ అరెస్ట్

సినీ, టీవీ నటి రాఖీసావంత్ ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. రామాయణ మహా కావ్యాన్ని రచించిన వాల్మీకి పై ఆమె ఒక టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, దానిపై కొందరు కోర్టును ఆశ్రయిచండంతో కోర్టు రాఖీ సావంత్ కు సమన్లు జారీ చేసింది. సమన్లు వచ్చినప్పటికీ కోర్టుకు హాజరు కాకపోవడంతో రాఖీ సావంత్ పై పంజాబ్ లోని లూథియానా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆమెను  ను అరెస్టు  చేశారు. తన నోటి దురుసుతో నిత్యం వార్తల్లో ఉండే రాఖీ సావంత్ వాల్మీకిపై చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ వాల్మీకి బోయ కులస్తులు లూధియానా కోర్టులో కేసు వేశారు.

ప్రస్తుత ఈ వివాదానికి చాలా పెద్ద కథే ఉంది  ప్రముఖ పంజాబీ గాయకుడు మిక్కాసింగ్ పుట్టినరోజు సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ రాఖీ చేసిన ఫిర్యాదుతో మిక్కా జైలుకు పోవాల్సి వచ్చంది. ఈ వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలంటూ బాలీవుడ్ లోని ప్రముఖులు చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో రాఖీ కేసును వాపస్ తీసుకుంది. ఈ సందర్భంలో రాఖీ సావంత్ ఒక టీవీ షో లో మాట్లాడుతూ మిక్కాపై తాను కేసు వాపస్ తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ మిక్కాసింగ్ మంచివాడిగా మారాడని అంటూ వాల్మీకిని ప్రస్తావించింది. వాల్మీకిని ప్రస్తావించిన తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలపై కొందరు కోర్టును ఆశ్రయించారు. చివరికి రాఖీ సావంత్ తాను ఉద్దేశపూర్వకంగా అటువంటి వ్యాఖ్యలు చేయలేదంటూ వివరణ ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రకరకాల మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు రాఖీసావంత్ అరెస్టుకు దారితీసింది.

 

Releated

సుష్మస్వరాజ్ కన్నుమూత

సుష్మాస్వరాజ్ కన్నుమూత…

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూశాలు. తీవ్ర గుండెపోటుతో ఆమె చనిపోయారు. 67 సంవత్సరాల సుష్మ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనివల్లే ఆమె పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. సుష్మాకు మంగళవారం రాత్రి గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు దిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలించారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు భర్త స్వరాజ్‌ కౌశల్‌, కుమార్తె బన్సురి […]

సుదర్శన యాగం

యాదాద్రిలో భారీ ఎత్తున సుదర్శన యాగం

యాదగిరి గుట్ట దేవాలయ పుననిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చేదిద్దేపనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ యాగ నిర్వహణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామితో ముఖ్యమంత్రి చర్చించారు. యాదాద్రిలో వంద ఎకరాల యజ్ఞవాటికలో 1048 యజ్ఞ కుండాలతో యాగం నిర్వహించాలని నిర్ణయించారు. మూడు వేల మంది రుత్వికులు, మరో 3వేల […]