ఆగిన లారీలు-పెరిగిన ధరలు

లారీ యజమానులు గత ఆరు రోజులుగా చేస్తున్న సమ్మెతో నిత్యావసరాలకు రెక్కలు వచ్చాయి. లారీలు తిరగక పోవడంతో ఎక్కడి సరుకు అక్కడే నిల్చిపోయింది. దీనితో నగరాలకు రావాల్సిన కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తులు రాకుండా పోయాయి. దీనితో వీటి ధర అమాంతం పెరిగిపోయాయి. మరోవైపు ఇదే అదనుగా నిత్యావసరాల ధరలను వ్యాపారులు పెంచేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కూరగాయల ధరలైతే మరీ మండిపోతున్నాయి. క్యారెట్, ఆలూ, ఉల్లిగడ్డ లాంటి కూరల ధరలు భారీగా పెరిగిపోయాయి. లారీల సమ్మెతే రైళ్లు, ప్రైవేటు బస్సులలో సరకును రవాణా చేస్తున్నా డిమాండ్ కు తగినట్టుగా సరకు రవాణా కావడం లేదు.  దీనితో సమ్మె ప్రభావం నిత్యావసర వస్తువులపై భారీగా పడింది.

కూరగాయలు మినహా ఇతర నిత్యావసరాల ధరలపై కూడా లారీల సమ్మె ప్రభావం పడింది. నగరానికి రావాల్సిన సరుకు రాకపోవడంతో వీటికి డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సరకు నిల్వలతో నెట్టుకొస్తున్నారు. భారీగా పెరిగిపోయిన ఇన్సురెన్సు ప్రీమియంను తగ్గించాలని, టోల్ గేట్ల ఛార్జీలను తగ్గించాలని, వివిధ రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నులను తగ్గించాలని లారీల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.