కొత్తగా రెండు వందల రూపాయల నోట్లు

ఆర్బీఐ కొత్తగా 200 రూపాయల నోటును తీసుకుని రానున్నట్టు సమాచారం. దీనిపై రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఎవరూ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ ఇటీవల ముగిసిన రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రు.200 నోటుపై అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. అయితే త్వరలోనే అనుమతి వస్తుందని జూన్ నుండి రెండువందల రూపాయల నోట్లను విడుదల అవుతాయని రిజర్వ్ బ్యాంకు వర్గాలు చెప్తున్నాయి.

మార్కెట్ లో చిన్న నోట్ల కొరత తీవ్రంగా ఉండడంతో కొత్తగా రెండు వందల రూపాయల నోట్లను తీసుకుని రావాలని రిజర్వ్ బ్యాంకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను తీసుకుని వచ్చిన రిజర్వ్ బ్యాంకు ఇప్పుడు రెండు వందల రూపాయల నోట్లను తీసుకుని వచ్చే సన్నాహాలు చేస్తోంది.