అప్పుడే పుట్టిన బిడ్డను చంపిన పెళ్లికాని తల్లి

అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసిందో పెళ్లికాని తల్లి..ఈ దారుణ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలీ లోని అంజయ్యనగర్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన 22 సంవత్సరాల యువతి హైదరాబాద్ లోని కాకతీయ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తోంది. పెళ్లికాని ఈ యువతి గర్భం దాల్చడంతో గర్భాన్ని కనిపించనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆదివారం ఆస్పత్రి బాత్రూం కు వెళ్లిన యువతి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో పాటుగా బాత్రూం నుండి పిల్లవాడి ఏడుపు వినిపించడంతో ఆస్పత్రి సిబ్బంది తలుపులు గట్టిగా కొట్టి యువతిని బయటికి రప్పించారు. అప్పటికే బకెట్ లో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహాన్ని కనుగొన్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడే పుట్టిన పసికందును నీళ్లలో ముంచి చంపేసినట్టు పోలీసులు చెప్తున్నారు. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డను ఊపిరి ఆడకుండా చేసిన హత్యచేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *