మరోసారి కీరవాణి వివాదాస్పద ట్వీట్ లు

ప్రముఖ సంగీత దర్శకుడు మరోసారి ట్విట్టర్ లో వంగ్యాస్త్రాలు సంధించారు. తాను బుర్రలేని వాడినని చెప్పుకుంటూ గతంలో తాను చేసిన ట్విట్ లను డిలీట్ చేస్తున్నానన్నారు. మరోసారి ఆయన చేసిన ట్విట్ లు సంచలనం రేపుతున్నాయి. ఆయన తాజాగా చేసిన ట్విట్ లు

  • అందరు దర్శకులు గొప్పవారు, వినయ, విధేయతలు గల వారు. నేను ఎప్పటికీ బుర్రతక్కువ వాడిని.
  • ప్రపంచంలో ఉన్న దర్శకులందరూ గొప్పవాళ్లు. వాళ్లతో పనిచేసేందుకు నేను పడి చస్తా. అయితే అందరికన్నా చివరిలో స్థానంలో ఉండే నేను ఒక బుర్రలేని కంపోజర్‌ని.
  • తాజాగా నాకు ఎవరో నిఘంటువును పంపారు. అందులో అహంకారానికి అర్థం .కీరవాణి అని ఉంది. ఆ పుస్తకం ప్రకారం నడుచుకుంటా.
  • అందరూ సృజనశీలురు, ఒద్దికగా ఉండేవాళ్లు. నేను తప్ప.
  • నేను చేసిన ట్వీట్లు చాలామందిని బాధించాయి. తమ్మారెడ్డి భరద్వాజ వంటి పెద్దల సూచన మేరకు వాటిని డిలీట్‌ చేశాను.
  • ఐదు నిమిషాల పాటు బుర్రలేని నా బుర్రను తమ్మారెడ్డి భరద్వాజ వాష్‌ చేశారు.
  • మేమందరం ఎప్పటికీ విద్యార్థులమే. తప్పులు చేస్తుంటాం. తమ్మారెడ్డి భరద్వాజలాంటి వారు మమ్మల్ని సరిదిద్దుతుంటారు.
  • ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
  • మరోసారి తమ్మారెడ్డి భరద్వాజ, త్యాగయ్యగారికి ధన్యవాదాలు