ఎప్రిల్ 2న ఏపీ క్యాబినెట్ విస్తరణ

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. ఎప్రిల్ 2వ తేదీ ఉదయం 9.25కు ముహూర్తాన్ని ఖరారు చేశారు. అమరావతిలోని సచివాలయం అవరణలో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీగా ప్రమాణ  స్వీకారం చేసిన చంద్రబాబు తనయుడు లోకేశ్ కు మంత్రి వర్గంలో చోటు ఖాయం అయిపోయింది. ఆయనకు ఐటి, పంజాయతీరాజ్ శాఖలను కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా ఐటి, పంచాయతీ రాజ్ శాఖలను నిర్వహిస్తున్న సంగతి గమనార్హం.
మంత్రి వర్గంలో మార్పు చేర్పులు తప్పని తెలుస్తోంది. లోకేశ్ తో పాటుగా శ్రీకాకుళం నుండి కిమిడి కళా వెంకట్రావు,  కర్నూలు జిల్లా నుండి భూమా అఖిల ప్రియ,  నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర యాదవ్, చిత్తూరుకు చెందిన అమర్ నాధ్ రెడ్డిల కు అవకాశం లభించవచ్నుచు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షరీఫ్ కు కూడా అవకాశం ఉన్నట్టు సమాచారం.  వీరితో పాటుగా డొక్కా మాణిక్య వరప్రసాద్, పయ్యావుల కేశవ్, మాగుంట శ్రీనివాసరెడ్డి లకు అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న  పీతల సుజాత, కిమిడి మృణాళిని, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, పల్లె రఘునాధరెడ్డిలకు పదవీ గండం ఉన్నదనే ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం మంత్రివర్గంలో ముఖ్యంత్రి చంద్రబాబుతో పాటుగా 20 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలో మరో 6 గురికి అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *