శ్రీవారి ఆలయానికి పోటెత్తిన ముస్లీంలు

0
52

కడప జిల్లా దేవుని కడప శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి ముస్లీంలు పోటెత్తారు. ఉగాది  రోజున పెద్దఎత్తున ముస్లీంలు స్వామివారిని సేవించుకోవడం ఆనవాయితీ. వేంకటేశ్వరుడి భార్యల్లో ఒకరైన బీబీ నాంచారమ్మ ను తమ ఇంటి ఆడబడుచుగా భావించే ముస్లీంలు ఉగాది పర్వదినం రోజున ఈ దేవాలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అనాధిగా వస్తున్న ఈ ఆచారం ప్రకారం ఉగాది రోజున స్థానిక దేవాలయంలో హింధువుల కన్నా ముస్లీంలే పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మత సామరస్యానికి వేదికగా నిల్చే ఈ పండుగ రోజున హింధూ దేవాలయంలో ముస్లీంల పూజలు ప్రత్యేకత సంతరించుకున్నాయి.
బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడబడుచు అయినందున వేంకటేశ్వరుడు తమ అల్లుడని ఉగాది పర్వదినం రోజున అల్లుడి చూసి వెళ్లడం తమ ఆచారం అని ముస్లీంలు చెప్తున్నారు. అనాధిగా ఈ ఆచారం వస్తోందని వారు పేర్కొన్నారు. ఈ రోజున వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే మంచిదని కోరిన కోరికలు తీరుతాయని వారు చెప్తున్నారు. ఈ రోజున వచ్చే ముస్లీం భక్తులకు  స్తానిక హింధువులు సాదరంగా ఆహ్వానం పలుకుతారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here