వంద మందికి అసభ్య ఫోన్ కాల్స్

0
57

babjan
చూడడానికి అమాయకంగా పోలీసు పక్కన నిలబడ్డ వీడి పేరు బాబా జాన్…వీడి స్వస్థలం  చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం చెంబుకూరు గ్రామం. చేసేది కార్పెంటర్ పని… ప్రవృత్తి యువతులు, మహిళల ఫోన్ నంబర్లు సేకరించి వారితో అసభ్యంగా మాట్లాడడం… దాదాపు వంద మందికి పైగా వీడి బారిన పడ్డారు. మహిళల ఫోన్ నెంబర్లను నేర్పుగా సేకరించే వీడు వారికి ఫోన్ చేసి నానా ఇబ్బందులు పెట్టేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడం అసభ్యంగా మాట్లాడి వారిని వేధించడమే వీడి పని… తరచూ నెంబర్లను మారుస్తూ కొత్త నెంబర్ల ద్వారా వారికి ఫోన్లు చేస్తూ వేధింపులకు గురిచేసే వీడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వీడి బారిన పడ్డ హైదరాబాద్ చిక్కడ పల్లికి చెందిన ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీం టీం వీడి అటకట్టించింది. చిత్తూరుకు వెళ్లిన షీ టీం బృందం బాబా జాన్ ను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులకు అప్పగించింది. విచారణలో భాగంగా వీడి ఫోన్ పరిశీలించగా వంద మందికి పైగా అమ్మాయిల ఫోన్ నంబర్లు కనిపించాయి. వీరందరినీ తాను వేధించేవాడినని బాబా జాన్ పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. రకరకాల మార్గాల ద్వారా అమ్మాయిల పోన్ నెంబర్లను సేకరించినట్టు పోలీసులు తెలిపాడు.
దీన్ని కూడా చదవండి:
http://telanganaheadlines.in/2017/03/27/3315-recharge/

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here