బండ్ల గణేష్ పై తీవ్ర ఆరోపణలు

0
45

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పై నటుడు సచిన్ జోషి తీవ్ర విమర్శలు చేశాడు. బండ్ల గణేష్ తోడేలు లాంటి వాడని అతన్ని నమ్మి తాను వ్యాపారపరంగా చాలా నష్టపోయానని చెప్పాడు. సచిన్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వీడెవడు’. చిత్రం టీజర్‌ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన సచిన్ బండ్ల గణేష్ పై తీవ్రంగా మండిపడ్డారు. తనకు గణేష్ పెద్ద మొత్తంలో బాకీ ఉన్నాడని అన్నాడు. అతని వద్ద నుండి తనకు 27 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని దానికి గైను కోర్టుల్లో 14 కేసులు నడుస్తున్నాయని చెప్పాడు. అతనితో కలిసి చేసిన ఓరేయ్ పండు సినిమా షూటింగ్ సమయంలో తినడానికి తిండి కూడా లేదంటే సహాయం చేశానని చెప్పాడు. నమ్మిన తనను మోసం చేశాడని బండ్ల గణేష్ పెద్ద మోసగాడని అన్నాడు. కోర్టు కేసులతో గణేష్ పోలీసులు అరెస్టు చేయడానికి వస్తే అతని తండ్రి కంటతడి పెట్టుకున్నాడని తనను బతిమిలాడితే జాలిపడి వదిలేశానని సచిన్ జోషి అంటున్నాడు. బండ్ల గణేష్ ను వదిలిపెట్టేది లేదని అతని సంగతి కోర్టులో తెల్చుకుంటానని అన్నాడు.
నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి తనను చంపించడానికి ప్రయత్నించాడంటూ బండ్ల గణేష్ ఇటీవల ఒక ఇండర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ నయీం ద్వారా తనను చంపించేందుకు సచిన్ ప్రయత్నించాడని బండ్ల గణేష్ ఆరోపించారు. నయీం చనిపోవడంతో తాను బతికిపోయానని చెప్పాడు. దీనిపై స్పందించిన సచిన్ బండ్ల గణేష్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. తాను అటువంటి ప్రయత్నాలు ఏవీ చేయలేదని అన్నాడు.
 
ఇది కూడా చదవండి:
http://telanganaheadlines.in/2017/03/27/3312-usa-airport/

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here