తెలంగాణలోని హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచింది. చాలీచాలని మెస్ ఛార్జీలతో నెట్టుకొస్తున్న విద్యార్థులకు ఈ పెంపుతో కొంత ఉపశమనం లభించనుంది. మూడవ తరగతి నుండి ఏడవత తరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు నెలకు 750 రూపాయలు మెస్ ఛార్జీలు ఉండగా దాన్ని 950కు పెంచారు. ఎనిమిది నుండి 10వ తరగది విద్యార్థులకు 850 నుండి 11 వందల రూపాయలకు మెస్ ఛార్జీలు పెరిగాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు ఇప్పటి వరకు రు.1050 అందచేస్తుండగా దాన్ని 14 వందల రూపాయలకు పెంచారు. ఈ పెంపు వల్ల రాష్ట్రవ్యాప్తంగా వివిధ హాస్టల్స్ లో ఉన్న 18 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకురుతుంది.
హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని చాలాకాలంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన నేపధ్యంలో మెస్ ఛార్జీలు పెంచాలంటూ విద్యార్థులు డీమాండ్ చేస్తూ వచ్చారు. వారి డిమాండ్ల పై స్పందించిన ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి…
http://telanganaheadlines.in/2017/03/27/3330-ts-assembly/