మీకు హిమాన్షు.. మాకు దేవాన్షు… అంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో నవ్వులు పూయించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి మనవడి పేరు హిమాన్షు కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనవడి పేరు దేవాన్షు. అసెంబ్లీ ఆవరణలోతనకు ఎదురుపడ్డ రేవంత్ రెడ్డిని పలకరించిన టీఆర్ఎస్ ఎంపీ సుమన్ సస్పెండ్ అయిన మిమ్మల్ని అసెంబ్లీలోకి ఎవరు రానించారంటూ నవ్వుతూ పలకరించారు. దీనికి సమాధానంగా కేసీఆర్ మనవడు దేవాన్షు రికమెండేషన్ తో నేను వచ్చాను ఆ అబ్బాయి తన తాతకు చెప్పి నన్ను లోపలికి పంపించాడు అంటూ నవ్వూతూ వ్యాఖ్యానించాడు. మీలాంటి మిత్రులు ఇంత మంది ఉండికూడా లాభం లేకుండా పోయిందని ఆఖరికి దేవాన్షు వల్ల రాగలిగానంటూ సరదాగా వ్యాఖ్యానిస్తూ మీకు హిమాన్షు… మాకు దేవాన్షు… ఉన్నారు అనండంతో అక్కడున్న వారంతా సరదాగా నవ్వుకున్నారు.