రీజార్జ్ కోసం నెంబర్లిస్తే….!

నగరంలోని ఒక వివాహిత మొబైల్ కు వందల సంఖ్యలో మెసేజ్ లు, అర్థరాత్రి పూట కొత్త కొత్త ఫోన్ నెంబర్ల నుండి ఫోన్లు…. మరో యువతిదీ ఇదే అనుభవం… ఇది ఏ ఒకరిద్దరి సమస్యో కాదు నగరంలో చాలా మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరిలో కొంత మంది ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కానీ తెలియరాలేదు వీళ్లు చేసిన తప్పేంటో. ఎక్కడపడితే అక్కడ తమ మొబైల్స్ ను రీచార్జీ చేయించుకోవడమే వీరు చేసిన తప్పు… ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మొబైల్ రీచార్జ్ లు చేస్తున్నారు. ఇందులో అధికశాతం ఈజీ రికార్జ్ లే కావడంతో దుకాణుదారిడికి తమ ఫోన్ నంబర్ చేస్తే వారు రీజార్జ్ చేస్తున్నారు. ఇక్కడే చాలా చోట్ల సమస్యలు మొదలవుతున్నాయి. కొంత మంది దుకాణుదారులు అమ్మాయిల మొబైల్ ఫోన్ల్ ను ఆకతాయిలకు అందచేస్తుండగా కొన్ని సందర్భాల్లో దుకాణుదారులే అమ్మాయిల ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వారిని వేధిస్తున్నారు.
ఫోన్ రీచార్జ్ చేసుకునే సందర్భాల్లో జాగ్రత్తాగా ఉండాలని పోలీసలు సూచిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ రీచార్జ్ చేసుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని కనుక తెలిసిన దుకాణుదారుల వద్ద మాత్రమే రీచార్జ్ చేసుకోవాలని అంటున్నారు. ఆన్  లైన్ లో రీచార్జ్ చేసుకోవడం మరింత ఉత్తమమని వారంటున్నారు. రిజార్జ్ కోసం ఫోన్ నెంబర్ ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. రిజార్జ్ దుకాణుదారుల్లో ఎక్కువ శాతం ప్రస్తుతం ఈజీ రీచార్జ్ చేస్తున్నారు. దీని వల్ల ఫోన్ నెంబర్ చెప్పడం తప్పని సరి.  వీటితో పాటుగా ట్రూ కాలర్ లాంటి యాప్స్ ద్వారా కూడా మహిళలు ఫోన్ నెంబర్లు తెలుసుకుని వారిని ఇబ్బందులు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒక వేళ మీ మెబైక్ కు బ్లాంక్ కాల్స్ వచ్చినా గుర్తుతెలియని వ్యక్తుల నుండి ఎటువంటి మెసేజ్ లు వచ్చినా ఆ ఫోన్ నెంబర్లను బ్లాక్ చేయడంతో పాటుగా ఇంట్లో వాళ్లని ఈ విషయాన్ని చెప్పి పోలీసులను కానీ షీ టీమ్స్ కు కానీ ఫిర్యాదు చేయడం ఉత్తమం. భయపడి ఫిర్యాదు చేయకపోతే వారు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *