సరైన దుస్తులు లేవని విమానం ఎక్కనీయలేదు

దుస్తులు సరిగా లేవంటూ ఇద్దరు యువతులను విమానం ఎక్కనీయకపోవడం అమెరికాలో తీవ్ర దూమారం రేపుతోంది. దీనిపై అక్కడి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. లెగ్గింగ్స్ వేసుకున్నారంటూ ఇద్దరు యువతులను యునైటెట్ ఎయిర్ లైన్స్ విమానం ఎక్కనీయకుండా సిబ్బంది అడ్డుున్నారు.  లెగింగ్స్ పై మరో డ్రస్ వేసుకోవాలని లేదా డ్రెస్ మార్చుకోవాలంటూ వారిపై ఒత్తిడి తీసుకుని వచ్చారు. మరో డ్రస్ లేకపోవడంతో వారిని విమానం ఎక్కనీయకుండా అడ్డుకున్నారు. డెన్వర్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనను షాన్నాన్ వాట్స్ అనే మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో దీనిపై తీవ్ర దూమారం రేపుతోంది. దుస్తుల విషయంలో ఎయిర్ లైన్స్ పెత్తం ఏంటని పలువురు మండిపడుతున్నారు. ఈ చర్యలు మహిళల హక్కులను కాలరాయడమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళలు, యువతులు తమకు నచ్చిన, సౌకర్యవంతమైన దుస్తులు వేసుకుని వచ్చే హక్కు వారికుందని వారిని విమానం ఎక్కనీయకుండా అడ్డుకోవడం సరికాదంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శల వర్షం కురిపించారు. దీనిపై యునైటెడ్ ఎయిర్ లైన్స్ స్పందించిది. సరైన దుస్తులు వేసుకుని రాకుంటే వారని ప్రయాణించకుండా అడ్డుకునే హక్కు తమకుందని స్పష్టం చేసింది. అయితే ఇక్కడ సరైన అనే పదానికి సరైన నిర్వచనం మాత్రం ఆ సంస్థ ఇవ్వలేదు. దుస్తులు సరిగా వేసుకోకున్నా, చెప్పులు లేకున్నా తాము విమానం ఎక్కనీయకుండా అడ్డుకుంటామని ఇతర ప్రయాణికుల సౌకర్యం, భద్రత దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేేసింది. ఆ ఇద్దరు అమ్మాయిలు ఎయిర్ లైన్స్ సిబ్బంది పాస్ పై వచ్చారని టికెట్లు కొన్న వారి విషయంలో కొంత వెసులుబాటు ఉన్నా పాస్ ల పై ప్రయాణించే వారు మాత్రం ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని ఎయిర్ లైన్స్ స్పంష్టం చేసింది.
 
 
ఆ ట్వీట్లపై యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. సరైన దుస్తులు ధరించని ప్రయాణికులను తిరస్కరించే హక్కు ఎయిర్‌లైన్స్‌కు ఉంటుందని పేర్కొంది. ప్రయాణికులు, విమాన సిబ్బంది సౌకర్యం, భద్రత కోసం చెప్పులు లేకుండా, సరైన దస్తులు ధరించకుండా వచ్చిన ప్రయాణికులను విమానం ఎక్కకుండా ఆపొచ్చని స్పష్టం చేసింది. అయితే ‘సరైన దుస్తులు’ అంటే ఎలాంటివి అనే విషయాన్ని మాత్రం యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించలేదు. వెనుదిరిగిన ఇద్దరు అమ్మాయిలు యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగి పాస్‌పై వచ్చారని ఎయిర్‌లైన్స్‌ అధికార ప్రతినిధి జొనాథన్‌ తెలిపారు. సాధారణ ప్రయాణికులు లెగ్గింగ్స్‌, యోగా ప్యాంట్స్‌ వేసుకున్నా కూడా అనుమతి ఇస్తామని, కానీ పాస్‌పై ప్రయాణించే వారు మాత్రం కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.
అమ్మాయిలను విమానం ఎక్కనీయకపోవడంపై సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ తీరుపై నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. లెగ్గింగ్స్‌ ఎందుకు సరైన దుస్తులు కావు అని ప్రశ్నించారు. చాలా మంది మహిళలు ప్రయాణంలో సౌకర్యం కోసం లెగ్గింగ్స్‌, యోగా ప్యాంట్స్‌, స్పోర్ట్స్‌ దుస్తులు వేసుకుంటారని.. ఇలాంటి నిబంధనలు ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలపై ఇలాంటి ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉందని నెటిజన్లు మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *