కార్మికులపైకి దూసుకెళ్లిన కారు

0
53

హైదరాబాద్ మాదాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం మాదాపూర్ వద్ద రోడ్లు ఊడుస్తున్న సమయంలో అదుపుతప్పిన కారు వీరిపైకి దూసుకుని వచ్చింది. దీనితో శేరిలింగంపల్లి-11 లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న శాంతమ్మ, మంజులలు తీవ్రంగా గాయపడ్డారు. తోటి కార్మికులు వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తరచూ రోడ్డు ప్రమాదాలు గురికావడం కలవరం కలిగిస్తోంది. రోడ్లు ఊడుస్తున్న వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో వారి భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here