విజయవాడ రవాణా శాఖ అధికారులపై చిందులేసిన అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేశినేని నాని, బొండ ఉమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టిగానే క్లాస్ పీకారు. అధికార పార్టీలో ఉన్నమన్న సంగతి గ్రహించి మసలుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇటుంటి ఘటనలు పునరావృత్తం అయితే సహించేది లేదని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పినట్టు సమాచారం. ముఖ్యమంత్రి హెచ్చరికలతో దిగివచ్చిన ఇరువురు నేతలు రవాణా శాఖ కార్యాలయానికి చేరుకుని సంబంధింత అధికారికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ప్రైవేటు బస్సులకు సంబంధించిన వ్యవహారంలో ఇటు టీడీపీ నాయకులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరగ్గా రవాణా శాఖ అధికారులపై కేశినేని నాని, బోండ ఉమ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రవాణా కార్యాలయానికి చేరుకున్న వీరిద్దరు అధికారులపై తీవ్ర స్వరంతో మండిపడ్డారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వద్దకు చేరుకోవడంతో వారిద్దరినీ పిలిపించిన చంద్రబాబు నాయుడు ఇద్దరికీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.