అమెరికా నైట్ క్లబ్ లో కాల్పులు

అమెరికాలోని నైట్ క్లబ్ లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 15 మందికి పైగా గాయపడ్డారు. ఒహియోలోని సిన్సినాటి నైట్ క్లబ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. నైట్ క్లబ్ లోకి చొరబడిన ఒక వ్యక్తి విచక్షణా రహితంగా జరిపిన కాల్పులు జరిపాడు. కాల్పులకు తెగబడింది ఎవరు, ఎందుకు కాల్పులు జరిపాడు అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. రెండు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణ వల్ల ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నైట్ క్లబ్ లో కాల్పులు ఉగ్రవాద చర్యకాదని భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించిన పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *