టీఆర్ఎస్ ఎంపీల సర్వే ఫలితాలు….

0
44

ఎంపీల పనితీరుపై సర్వేఫలితాలను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు.  ఈ సర్వేలో తొలి స్థానంలో ఎంపీ వినోద్, రెండో స్థానంలో ఎంపీ సుమన్ లు ఉన్నారు.   మల్లారెడ్డి, సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్ లు చివరి స్థానాల్లో ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 15 ఎంపీ స్థానాలకు టీఆర్ఎస్ గెల్చుకుంటుందని కేసీఆర్ చెప్పారు. ఒక స్థానంలో ఎంఐఎం గెలుస్తుందని సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉంటుందని అన్నారు. సర్వే ఫలితాలు అన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ అఖండ మెజార్టీతో గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ప్రజల్లోకి వెళ్ళాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలని సూచించారు.
సర్వేలో వెనుకబడిన వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల్లో మంచి పేతు తెచ్చుకునేందుకు కృషి చేయాలన్నారు. సర్వే ఫలితాల వల్ల మనం ఎక్కడ వెకబడ్డామో తెలుస్తుందని దీని ద్వారా మనం మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని, కష్టపడి పనిచేయాలని సూచించారు. ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. వీలున్నంత వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ తిరిగి అవకాశం కల్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.
ప్రజలకు ఎంత చేరువ అయితే అంత మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యంత్రి కేసీఆర్ అన్నారు. పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేయాలని వారికి నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. టీఆర్ఎస్ కు తెలంగాణలో ప్రత్యామ్నాయం లేదన్నారు. రానున్న ఎన్నికల్లోనూ మనదే గెలుపని అయితే నాయకులు ప్రజల్లోనే ఉంటేనే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here