ఆస్ట్రేలియా 300 ఆలౌట్

0
59
India's Kuldeep Yadav, center, and his teammates celebrate the dismissal of Australia's Glenn Maxwell during the first day of their fourth test cricket match in Dharmsala, India, Saturday, March 25, 2017. (AP Photo/Tsering Topgyal)

భారత్-ఆస్ట్రేలియాల మధ్య ధర్మశాలలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆసిస్ మొదటి రోజు 300 పరుగులకు ఆలౌట్ అయింది. నాలుగో టెస్టు మ్యాచ్ లో ఆసిస్ టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు  పదిపరుగులు ఉన్నప్పుడు  ఓపెనర్‌ రెన్షా (1) ఔట్‌ అయ్యాడు. అయితే వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ స్మిత్, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు. రెండో వికెట్ కు 134 పరుగులు చేయడంతో ఆసిస్ బారీ స్కోరు ఖాయం అనుకున్న సమయంలో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న కుల్ దీప్ యాదవ్ తన బౌలింగ్ తో ఆసిస్ ను కట్టడి చేశాడు. తొలి మ్యాచ్ లోనే  నాలుగు వికెట్లు తీసిన కుల్ దీప్ ఆసిస్ ను భారీ స్కోర్ చేయకుండా నిలవరించాడు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (111; 173 బంతుల్లో 14×4), డేవిడ్‌ వార్నర్‌ (56; 87 బంతుల్లో 8×4, 1×6),మాథ్యూవేడ్‌ (57; 125 బంతుల్లో 3×4, 1×6) లు మినహా మిగతా ఆటగాళ్లు పెద్ద స్కోర్ లు చేయలేకపోయారు. దీనితో ఆసిస్ 300 పరుగులకు ఆలౌట్ అయింది. కుల్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆట మిగిసే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్ లో ఒకే ఓవర్ ఆడిన భారత్ పరుగుల ఖాతా తెరవలేదు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here