న్యూజెర్సీ జంట హత్యల్లో కొత్త కోణం

అమెరికా న్యూజెర్సీలో దారుణ హత్యకు గురైన తల్లీ కొడుకుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారని నర్రా హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ అల్లుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని హనుమంతరావు అత్తా,మామలు ఆరోపిస్తున్నారు. తమ కుమారై శశికళ, మనుమడు అనీష్ సాయిలను హనుమంతరావే హత్య చేసి తాను వచ్చేసరికే ఎవరో హత్యచేశారంటూ డ్రామాలు అడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. విజయవాడ సమీపంలో ఉంటున్న శశికళ తల్లిదండ్రులు సుంకర వెంకటేశ్వర్లు, కృష్ణకుమారి లు తమ అల్లుడి ప్రవర్తన సరిగా లేదని అంటున్నారు. తమ అల్లుడు వివాహేతర సంబంధం పెట్టుకుని తమ కూతురిని వేధిస్తున్నాడని ఈ విిషయాన్ని చెప్పి తమ కూరుతు చాలా సార్లు బాధపడిందన్నారు. హనుమంతరావు త‌న భార్య, కుమారుడు చనిపోయారనే ఒక్క మాటతో ఫోన్‌ పెట్టేశారని, అంతకు మించి మరే విషయం త‌మకు చెప్పలేదని మృతురాలి తల్లిదండ్రులు అంటున్నారు.
తమ అల్లుడి ప్రవర్తనను గురించి అతని కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. బంగారం లాంటి తమ కూతురుని మనుమడిని పొట్టన బెట్టుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు సమగ్రంగా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారంటున్నారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *