ఎంపీపై విమానయాన సంస్థల నిషేధం

వివాదాస్పద  శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ ఇక విమానాల్లో ప్రయాణించే అవకాశాలు కనిపించడం లేదు. మాహారాష్ట్రాలోని ఉస్మానాబాద్ ఎంపీ పై ఎయిర్ ఇండియా ఇప్పటికే నిషేధం విధించగా భారత విమానయాన సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఏ) కూడా ఆయపై నిషేధం విధించింది. దీనితో ఆయన విమానాల్లో ప్రయాణించే అవకాసం లేనట్టే. నిత్యం గొడవలు పెట్టుకునే ప్రయాణికులపై ఈ తరహా నిషేధాన్ని విధిస్తుంటారు. బిజినెస్ సీట్లే లేని ఎయిర్ ఇండియా విమానంలో తనకు బిజినెస్ టికెట్ ఇవ్వాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటుగా ఎయిర్ ఇండియా సీనియర్ మేనేజర్ ను చెప్పుతో కొట్టిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ చర్యలను విమానయాన సంస్థలు తీవ్రంగా తప్పుబట్టాయి. బౌతిక దాడులకు దిగినా చర్యలు తీసుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయంతో వెంటనే అటు ఎయిర్ ఇండియా ఇటు ఎఫ్ఐఏలు చర్యకు ఉపక్రమించాయి. ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ ను పై నిషేధాన్ని విధించాయి.  తమ సర్వీసుల పట్ల ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఇతరత్రా మార్గాల ద్వారా చర్యలు తీసుకోవచ్చు కానీ ఏకంగా సంస్థ సీనియర్ ఉద్యోగి పై దాడి చేయడం పై విమానయాన సంస్థలు సీరియస్ అయ్యాయి.
మరో వైపు ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టడాన్ని ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ మరోసారి సమర్థించుకున్నారు. తనను దమ్ముంటే పోలీసులు అరెస్టు చేయాలంటూ సవాల్ విసిరారు. తాను ఢిల్లీలోనే ఉన్నానని పోలీసులకు దమ్ముటే తనను అరెస్టు చేయాలని ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తమ పార్టీ మద్దతు తనకు పూర్తిగా ఉందని చెప్పారు. ఉద్యోగికి తాను క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదని అతనే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పార్లమెంటు సభ్యుడితో ఎట్లా మాట్లాడాలి అనే విషయం సీనియర్ అధికారికి తెలిసి ఉండాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *