పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే…

కాటమరాయుడు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో పవన్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన సర్థార్ గబ్బర్ సింగ్ పూర్తిగా నిరాశ పర్చడంతో కాటమరాయుడుపై పవన్ అభిమానులు భారీగా ఆశలుపెట్టుకున్నారు. ఈ చిత్రంలో పవన్ రూపం, నటన ఆకట్టుకున్నాయి. పల్లెటూరి వాతావరణంలో సాగిన ఈ చిత్రంలో పవన్ పూర్తిగా గ్రామీణ నేపధ్య దుస్తుల్లో స్టైల్ గా కనిపించాడు. కాటమరాయుడు పూర్తిగా పవన్ చిత్రం. ఇతర పాత్రలు ఏవీ పెద్దగా కనిపించలేదు. పవన్ అభిమానులకు కనుకపండుగ్గా సాగేే చిత్రంమొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూతానే తిరుగుతుంది.గ్రామ పెద్ద పాత్రలో కనిపించే పవన్ కు నలుగురు తమ్ముళ్లు తమ్ముళ్లతో పాటుగా గ్రామప్రజలంటే ప్రాణం పెట్టే కాటమరాయుడు ఆడపిల్లలంటే మాత్రంం ఆమడ దూరం పారిపోతాడు. ఈ క్రమంలో అతనికి పరిచయం అయిన శ్రుతిహాసన్ పవన్ ను ఎట్లా మార్చింది అన్న విషయం వెండి తెరపై చూడాల్సిందే. పస్ట్ హాస్ సరదాగా సాగినా సెంకడ్ హాఫ్ పూర్తిగా సాగతీసినట్టు అనిపించింది. పవన్ మినహా మిగతా వారి పాత్రలతో దర్శకుడు డాలీ పెద్ద గా దృష్టిపెట్టినట్టు కనిపించలేదు. సినిమా మొత్తం పవన్ చుట్టూతానేే తిరిగింది. రీమేక్ సినిమా అయినా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా చేసిన మార్పులు ఆకట్టుకున్నాయి. కెమేరా పనితనం బాగుంది. గ్రామీణ ప్రాంత అందాలను చాలా చక్కగా చూపించారు ఛాయగ్రహకుడు ప్రసాద్. ఈ సినిమాలో పాటలు, డ్యాన్స్ లు పెద్దగా ఆకట్టుకునే స్థాయిలో లేవు. మొత్తం మీద కాటమరాయుడు పవన్ అభిమానులకు కన్నుల పండుగే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *