నగర ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా

0
59

వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పదవికి రాజీనామా చేశారు. హైదరాబాద్ పాతబస్తీ గోషామహాల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాసింగ్ తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా సీఎంకు పంపారు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా లేఖను స్పీకర్ పంపాల్సి ఉండగా ముఖ్యమంత్రికి పంపడం విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా ఆపాయింట్ మెంట్ దొరకలేదని దీనితో మనస్థాపంతో రాజీనామా చేసినట్టు రాజాసింగ్ చెప్పారు. గుడంబాకు అడ్డాగా ఉన్న ధూల్ పేట గుడంబా తయారీదారులపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం వారికి సరైన ప్రత్యామ్నాయాన్ని కల్పించడంలో విఫలమైందని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే ధూల్ పేట వాసులు గుడంబా తయారీ వైపు మళ్లారని ప్రస్తుతం గుడంబా తయారీని అరికట్టిన ప్రభుత్వం వారికి ఉపాధీ అవకాశాలు చూపకపోవడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయనేది రాజాసింగ్ ఆరోపణ.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here