సౌదీలో భారత మహిళపై దారుణం

సౌదీ అరేబియాలో లైంగిక దోపిడికి గురవుతున్న  ఓ భారత మహిళను భారత అధికారులు కాపాడారు. గుజరాత్ కు చెందిన 35 సంవత్సరాల మహిళను ఇంటి పనులకోసం అంటూ కొంత మంది ఏజెంట్లు దుబాయ్ కు తీసుకుని వెళ్లారు. నెలకు 40వేల జీతం వస్తుందని చెప్పిన ఆమెను దుబాయ్ కు తీసుకుని వెళ్లిన తరువాత ఆమెను సౌదీ అరేబియాకు చెందిన వారికి అమ్మేశారు. అక్కడి నుండి ఆమెకు ఇబ్బందులు తప్పలేదు. అక్కడ ఆ మహిళ నానా హింసకు గురైంది. లైంగికంగా మహిళను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కనీసం తాను ఎక్కడ ఉన్నానో కూడా తెలియని పరిస్థితి. వ్యభిచారం నేరంగా పరిగణించే సౌదీలో పురుషుడు ఎన్ని వివాహాలు అయినా చేసుకోవచ్చు. దీన్ని అడ్డంపెట్టుకుని కొంత మంది వివాహం పేరుతో మహిళలను దారుణంగా హింసిస్తున్నారు. ఇంటి పనులకు ఉపయోగించుకోవడం తో పాటుగా వారిని దారుణంగా హింసకు గురిచేస్తున్నారు.
సౌదీలో తాను పడ్డ కష్టాలను గుజరాత్ మహిళ భారత అధికారులకు వివరించింది. తాను ఎక్కడ ఉన్నానో కూడా తెలియని స్థితిలో ఇంటిలో బంధించారని తనను దారుణ లైంగిక హింసకు గురిచేసినట్టు మహిళ వాపోయింది. ప్రస్తుతం గుజరాత్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ ఆరోగ్యం మెరుగైన తరువాత మరిన్ని విరాలు రాబట్టే పనిలో ఉన్నారు అధికారులు. తీవ్ర మానసిక, శారీరక హింసకు గురైన మహిళ సరైన వివరాలు కూడా చెప్పలేకపోతోందని అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ముంబైకి చెందిన ఇద్దరు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. మరికొద్ది మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పోలీసులు అధికారులు చెప్పారు. సాధారణంగా గల్ఫ్ ప్రాంతాలకు మహిళలను తీసుకుని పోయే ఏజెంట్లు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల పైనే దృష్టి పెట్టేవారు అయితే ఈ రాష్ట్రాల్లో పోలీసు నిఘా పెరగడంతో వారు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *