ఆంధ్రప్రదేశ్ లోని మూడు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, మరో మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు మొదలుకాగా నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెల్చుకుంది. టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై 85 ఓట్ల తేడాచో విజయం సాధించారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకుండా పోయాయి. టీడీపీ అభ్యర్థికి 462 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 377 ఓట్లు వచ్చాయి.